![]() |
![]() |
.webp)
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -260 లో...... రుద్రకి గంగ ఫోన్ చేసి సర్ నేను గుడికి వచ్చాను. బాక్సింగ్ ప్రాక్టీస్ కి ఇటు నుండే వస్తానని గంగ అనగానే నాకు చిరాకుగా ఉంది ఫోన్ కట్ చెయ్.. పెద్దనాన్నతో మాట్లాడాలని రుద్ర అనగానే పెద్దోరు కూడా ఇక్కడే ఉన్నారని గంగ అంటుంది. సరే వస్తున్నానని రుద్ర అంటాడు. ఏంటి గంగా.. సుధాని ఒక్కదాన్నే వదిలేసి వచ్చావ్.. ఈ ప్రసాదం తనకి ఇవ్వమని పెద్దసారు అంటాడు. గంగ ప్రసాదం తీసుకొని సుధా దగ్గరికి వెళ్తుంది. ఆగు చెయ్ కడుక్కొని వస్తానని సుధా వెళ్తుంటే తను కిందపడబోతుంది అప్పుడే పెద్దసారు వచ్చి పట్టుకుంటాడు.
అన్నయ్య అని తనని హగ్ చేసుకొని సుధా ఎమోషనల్ అవుతుంది. ఇద్దరు ఒకరికొకరు చూసుకుంటు ఎమోషనల్ అవుతారు. అదంతా గంగ చూసి షాక్ అవుతుంది. సుధానే పెద్దసారు చెల్లి అని తనకి అర్థమవుతుంది. అన్నాచెల్లెలు ఇద్దరు తమ కష్టసుఖాలు చెప్పుకుంటారు. అప్పుడే రుద్ర కోపంగా అక్కడికి వచ్చి మిమ్మల్ని ఆ విశ్వగారు ఇష్టం వచ్చినట్లు తిడుతుంటే.. మీరు ఎందుకు సైలెంట్ గా ఉన్నారని రుద్ర అడుగుతాడు. మిమ్మల్ని ఆయన ఏం అన్నాడు అన్నయ్య అని సుధా అనగానే రుద్ర షాక్ అవుతాడు. అన్నయ్యనా అని రుద్ర అనగానే అవును సర్ ఆవిడా పెద్దోరు చెల్లి మీ మేనత్త అని గంగ అనగానే.. రుద్ర హ్యాపీగా ఫీల్ అవుతు మేడం అంటాడు. మేడం కాదు అత్తయ్య అను అని సుధా అనగానే అత్తయ్య అని రుద్ర అంటాడు. సుధా దగ్గరికి తీసుకుంటుంది. అప్పుడే శకుంతల, ఇషిక, రావడం రంగా చూసి వాళ్లకు చెప్తాడు. దాంతో శకుంతల కోప్పడుతుందని సుధా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. శకుంతల వచ్చి నాకు చెప్పకుండా వచ్చారని పెద్దసారుపై కోప్పడుతుంది.
మరొకవైపు పైడిరాజు కార్ ని సూపర్ మార్కెట్ ముందు ఆపుతాడు. ఏంటి ఇక్కడ అపావు అని విశ్వ అడుగుతాడు. అమ్మగారు ఈ సరుకులు తీసుకొని రమ్మన్నారని పైడిరాజు అంటాడు. నువ్వు వెళ్ళు నేను రానని తనకి కార్డు ఇస్తాడు విశ్వ. లోపలికి వెళ్లి ప్రమీలకి లిస్ట్ ఇస్తాడు.. తను అన్ని తీసుకొని వచ్చి బిల్ పే చేసేటప్పుడు కార్డు పని చేయదు. దాంతో ఆ విషయం విశ్వ దగ్గరికి వెళ్లి చెప్తాడు. విశ్వ కోపంగా లోపలికి వస్తాడు. తను ట్రై చేస్తాడు పేమెంట్ అవ్వదు.. తర్వాత ఇవ్వండి అని ప్రమీల అంటుంది. నువ్వు ఎవరు అని విశ్వ అడుగుతాడు. విజయేంద్ర ప్రతాప్ కోడలు అని ప్రమీల అనగానే అంటే భాను భార్య.... ఈ అమ్మాయి చాలా మంచి మనిషిలాగా ఉంది.. విజయేంద్ర ప్రతాప్ తప్పు చేస్తే నేను భాను గురించి తప్పుగా మాట్లాడాను అని విశ్వ అనుకొని ఐ యమ్ సారీ అని అంటాడు. ప్రమీలకి ఏం అర్థం కాదు కార్డు పని చెయ్యడం లేదని కోపంగా మాట్లాడినందుకు సారీ చెప్పాడేమో అని ప్రమీల అనుకుటుంది. ప్రమీల వంక విశ్వ జాలిగా చూస్తాడు. తరువాయి భాగంలో రుద్ర, గంగ కలిసి పెద్దసారు, శకుంతలల షష్ఠిపూర్తి చెయ్యాలని అనుకుంటారు. ఫంక్షన్ కి సుధాని పిలవాలని ప్లాన్ చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |